ఇటలీ నుంచి ఇంటికి...

9 Nov, 2023 04:55 IST|Sakshi

దాదాపు రెండు నెలల ఇటలీ ట్రిప్‌ను ముగించుకుని బుధవారం తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు ప్రభాస్‌. ఇక ముందుగా విడుదలకు సిద్ధంగా ఉన్న ‘సలార్‌’ చిత్రం తొలి భాగం ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారట ప్రభాస్‌.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ చిత్రం డిసెంబరు 22న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’, మారుతి దర్శకత్వంలోని ‘రాజాడీలక్స్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమాల షూటింగ్స్‌లో సమాంతరంగా ΄ాల్గొనేలా ప్రభాస్‌ ΄్లాన్‌ చేస్తున్నారని సమాచారం. 

మరిన్ని వార్తలు