అది బాలయ్య టైటిల్ కాదు..!

8 Jul, 2017 15:17 IST|Sakshi
అది బాలయ్య టైటిల్ కాదు..!

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ ఆ తరువాత కేయస్ రవికుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి. సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి హీరోయిన్ ఎవరు టైటిల్ ఏంటి అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

ఇప్పటికే హీరోయిన్గా నయనతారను కన్ఫామ్ చేశారు చిత్రయూనిట్. చిత్ర నిర్మాణ సంస్థ ఇటీవల ఛాంబర్లో రూలర్ అనే టైటిల్ రిజిస్టర్ చేయటంతో అదే బాలయ్య సినిమా టైటిల్ అన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్ని చిత్ర  యూనిట్ ఖండించారు. ప్రస్తుతానికి సినిమాకు ఏ టైటిల్ నిర్ణయించలేదని తెలిపారు. రూలర్తో పాటు జయసింహా, రెడ్డి గారు లాంటి టైటిల్స్ బాలయ్య సినిమాకు పరిశీలనలో ఉన్నాయి.