మద్యం మైకంలో సహనటిపై స్టార్‌ హీరో దాడి!

1 Apr, 2018 18:14 IST|Sakshi
నటి అక్షరాసింగ్‌

న్యూఢిల్లీ: భోజ్‌పురి చిత్రపరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న పవన్‌ సింగ్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. పలు సినిమాల్లో నటించి.. పాపులర్‌ పాటలు పాడిన పవన్‌ సింగ్‌ తాజాగా మద్యం మత్తులో సహనటిపై దాడి చేశాడు. భోజ్‌పురి స్టార్‌ హీరోయిన్‌ అయిన అక్షరాసింగ్‌ను మద్యం మత్తులో చితకబాదాడు. ఈ ఘటన గురించి ప్రముఖ జర్నలిస్ట్‌ శశికాంత్‌ సింగ్‌ ఫేస్‌బుక్‌లో పోస్టుచేయడంతో వెలుగులోకి వచ్చింది.

కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్‌ హావేలి రాజధాని సిల్వాసాలోని దామన్‌గంగా వ్యాలీ రిస్టార్‌లో గురువారం అర్ధరాత్రి 11.30 గంటలకు ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న పవన్‌సింగ్‌ అక్షర జుట్టు పట్టుకొని.. ఆమె తలను గోడకేసి కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో అక్షర చేతికి గాయమైంది. ఆమె అరుపులతో పరుగెత్తుకొచ్చిన రిసార్ట్‌ సిబ్బంది ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, పవన్‌ వారిపై కూడా దాడిచేశాడు.

సిల్వాసాలో పవన్ సింగ్‌‌, అక్షర ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారని, తాగిన మైకంలో ఉన్న పవన్‌ గదిలోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా ఆమెతో అతను అసభ్యంగా ప్రవర్తించి..దూషించాడని జర్నలిస్ట్‌ శశికాంత్‌సింగ్‌ తెలిపారు. సిల్వాసాలో ఆమె షూటింగ్‌ పూర్తయి.. ముంబై రావాల్సి ఉందని, కానీ ఎయిర్‌పోర్టు వరకు డ్రాప్‌చేసేవారు లేకపోవడంతో ఇప్పటికీ ఆమె అక్కడే ఉండిపోయిందని శశికాంత్‌సింగ్‌ వివరించారు. పవన్‌, అక్షర ప్రేమలో ఉన్నట్టు గతంలో కథనాలు వచ్చాయి. ఈ ఇద్దరూ సన్నిహితంగా తిరిగారు. అయితే, పవన్‌ మాత్రం ఇటీవల జ్యోతిసింగ్‌ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.


                                        భోజ్‌పురి సూపర్‌స్టార్‌ పవన్‌సింగ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు