విదేశీయులను పెళ్లాడిన సెలబ్రెటీలు

3 Jul, 2018 11:33 IST|Sakshi

సెలబ్రెటీల జీవితాల్లో ప్రతీ అంశం ఆసక్తికరమే. అందుకే వారి వ్యక్తిగత జీవిత విశేషాల పై కూడా అభిమానులు ఆసక్తికనబరుస్తుంటారు. ముఖ్యంగా వారి ప్రేమ పెళ్లి లాంటి విషయాల కు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాతో పాటు మీడియాలోనూ ప్రముఖం వినిపిస్తుంటాయి. ఇటీవల హాలీవుడ్‌లో సత్తా చాటుతున్న బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ గాయకుడు జాన్‌ నికోస్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్‌ ఫంక్షన్స్‌లోనూ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకు కనిపించటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. దీంతో గతంలో ఇలా విదేశీయులతో ప్రేమ పెళ్లిల్లు చేసుకున్న తారల జీవితాలకు సంబంధించిన చర్చ మొదలైంది.

ఈ జాబితాలో దేశీయ తారలు చాలా మందే ఉన్నారు. ఇటీవల కాలంలో మన సెలబ్రెటీ నటీనటులు చాలా మంది విదేశీయులను పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది శ్రియా, ఆండ్రీ కోశ్చివ్‌ను వివాహం చేసుకోవడం, ఇలియానా, ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌తో ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం సాగించటం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా.. ప్రియాంక, నిక్‌ జోనాస్‌లకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. వీరి కుటుంబ కార్యక్రమాలకు కూడా ఇద్దరు కలిసి హాజరవుతున్నారు. 

గతంలో.. ప్రీతిజింటా లాస్‌ ఏంజిల్స్‌లోని ఆర్థిక విశ్లేషకుడు జీన్‌ గుడ్నఫ్‌తో కొంతకాలం పాటు డేటింగ్‌ చేసి 2016లో వివాహం చేసుకున్నారు. బుల్లితెర నటి ఆష్కా గొరాడియా అమెరికన్‌ బ్రెంట్‌ గ్లోబేతో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో గతేడాది డిసెంబర్‌లో వివాహం జరిగింది. లాస్‌ వెగాస్‌లో వీరు మొదటిసారిగా కలుసుకున్నారు. టీవీ నటి అయిన సుచిత్ర పిళ్లై డెన్మార్క్‌కు చెందిన లార్స్‌ జెల్సన్‌ అనే ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరు మొదటి సారిగా ముంబైలో జరిగిన ఓ వేడుకలో కలిశారు.

అరుణోదయ్‌ సింగ్‌ అనే నటుడు కెనడాకు చెందిన లీ ఎల్టన్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరు గోవాలో మొదటిసారిగా కలుసుకున్నారు. లక్కీ అలీ అనే గాయకుడి మూడో భార్య ఎలిజబెత్‌ హాలమ్‌.  ఈమె మాజీ మిస్‌ గ్రేట్‌ బ్రిటన్‌. వీరికి 2010లో వివాహం జరిగింది. వివాహానంతరం ఈమె పేరును అయేషా అలీగా మార్చుకున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ శశి కపూర్‌ బ్రిటీష్‌ నటి జెన్నిఫర్‌ కెండల్‌ను 1958లో వివాహమాడారు. సల్మాన్‌ ఖాన్‌, రొమేనియన్‌ మోడల్‌ లూలియా వాంటూర్‌కు మధ్య ఏదో నడుస్తుందన్న వార్త బాలీవుడ్‌లో ఇప్పటికీ హాట్‌ టాపికే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా