ఒక్క కట్‌తో ఉడ్తా పంజాబ్‌కు హైకోర్టు ఓకే

13 Jun, 2016 17:13 IST|Sakshi
ఒక్క కట్‌తో ఉడ్తా పంజాబ్‌కు హైకోర్టు ఓకే

ఉడ్తా పంజాబ్ సినిమా న్యాయ పోరాటానికి ఫలితం లభించింది. రెండు రోజుల్లో సినిమాకు కొత్త సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీని బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలన్న సీబీఎఫ్‌సీ డిమాండును హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు నిర్ణయంతో తమకు పెద్ద ఊరట కలిగిందని, సినిమాను షెడ్యూల్డు సమయానికే విడుదల చేయాలని చూస్తున్నామని చిత్ర దర్శకుడు అభిషేక్ చౌబే తెలిపారు. ఇది కేవలం తమకు మాత్రమే కాక మొత్తం సినీ పరిశ్రమకే మంచి తీర్పు అని సినిమా సహ నిర్మాత మధు మంతెన వర్మ అన్నారు. తాము కేవలం ఒక్క సీన్ మాత్రమే కట్ చేయాల్సి ఉంటుందని, ఈ తీర్పుతో ప్రజాస్వామ్యం నిలబడినట్లయిందని అనురాగ్ కశ్యప్ తరఫు న్యాయవాది అన్నారు.

అంతకుముందు సీబీఎఫ్‌సీ సూచించిన అన్ని కట్‌లను హైకోర్టు పరిశీలించి ఒక్కొక్క దానిపై వ్యాఖ్యానించింది. సీబీఎఫ్‌సీ సూచించిన 8వ కట్ ఏమాత్రం అక్కర్లేదని, కేవలం ఒక వ్యక్తి డ్రగ్స్ ఇంజక్షన్ తీసుకుంటున్న క్లోజప్ షాట్ వల్ల నియమాలను ఉల్లంఘించినట్లు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఏడో కట్ కూడా అక్కర్లేదని, మూడో పాటలో గోకుతున్న సీన్‌ను తీయక్కర్లేదని స్పష్టం చేసింది. పంజాబ్ హరిత విప్లవ భూమి అని, కేవలం ఒక్క వాక్యం వల్ల (జమీన్ బంజర్ తే ఔలాద్ కంజర్) ఆ ఇమేజికి ఎలాంటి భంగం వాటిల్లదని తెలిపింది. ఇక టామీ సింగ్ జనం ఎదురుగా మూత్రవిసర్జన చేస్తున్న సీన్ అవసరం లేదన్న హైకోర్టు.. ఆ సీన్‌ను సినిమాలోంచి తీసేయాలని తెలిపింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం