చంద్రబోస్‌కు మాతృ వియోగం

20 May, 2019 14:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి మదనమ్మ సోమవారం గుండెపోటుతో హైదరాబాద్‌లోమృతి చెందారు. వరంగల్‌ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మదనమ్మకు మొత్తం నలుగురు సంతానం కాగా వారిలో చంద్రబోస్ చివరివాడు. చంద్రబోస్‌కు పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు