OTT Movie: 'పుష్ప' విలన్ కొత్త మూవీ.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్

30 Nov, 2023 15:12 IST|Sakshi

మరో తెలుగు సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అప్పుడెప్పుడో జూన్ చివర్లో థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఓ రకంగా చెప్పాలంటే పూర్తిగా పక్కనబెట్టేశారు. ఆగస్టులో ఓటీటీలో రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఎందుకో ఇదీ వాయిదా పడింది. దాదాపు నాలుగు నెలల తర్వాత అంటే ఇప్పుడు తాజాగా ఓటీటీలో ఈ సినిమాని తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇంతకీ ఏంటా సినిమా?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్.. పలు భాషల్లో చిన్న సినిమాలు కూడా తీస్తోంది. అలా 'పుష్ప' ఫేమ్ ఫహాద్ ఫాజిల్ హీరోగా 'ధూమమ్' అనే సినిమా తీసింది. దీన్ని దక్షిణాదిలో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ డబ్బింగ్ పనులు ఆలస్యం కావడంతో తెలుగు రిలీజ్ వాయిదా వేశారు. అదే టైంలో కన్నడ, మలయాళ భాషల్లో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు వెర్షన్ విడుదలని పూర్తిగా పక్కనబెట్టేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు)

ఇన్నాళ్లకు ఓటీటీలోకి
జూన్ 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాని రెండు వారాల్లోనే అంటే ఆగస్టు 4నే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఏమైందో ఏమో గానీ ఓటీటీ స్ట్రీమింగ్ కూడా వాయిదా వేశారు. అలా ఈ మూవీ గురించి అందరూ మర్చిపోయారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఆపిల్ టీవీ ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'ధూమమ్' చిత్రం అందుబాటులోకి వచ్చేసింది.

'ధూమమ్' కథేంటి?
ఓ సిగరెట్ కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేసే అవినాష్ (ఫహాద్ ఫాజిల్).. ఓ అపరిచిత వ్యక్తి కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. అవినాష్‌ని అతడు బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు. తన మాట వినకపోతే అతడి భార్య దియా (అపర్ణ బాలమురళి) శరీరంలో ఫిక్స్ చేసిన మైక్రో బాంబ్‍‌ని పేల్చేస్తానని బెదిరిస్తాడు. ఇంతకీ ఆ అపరిచతుడు ఎవరు? ఎందుకు బెదిరిస్తున్నాడు? చివరకు ఏమైందనేది 'ధూమమ్' స్టోరీ.

(ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)

మరిన్ని వార్తలు