అమితాబ్తో కలిస్తే హిట్టే!

23 Mar, 2015 19:48 IST|Sakshi
అమితాబ్తో కలిస్తే హిట్టే!

వాడిపోవడానికి అతను పుట్టింది మహా వృక్షం నీడలోకాదు.. వృక్షానికి తోడుగా.. ఊడలా! ఆ తోడులో నేర్చిన పాఠాలతో మళ్లీ తానే ఓ నటవృక్షంగా ఎదిగేంతలా! భారతీయ సినిమాకు మూల పురుషులు, పురుడు పోసిన మహానుభావులు ఎందరెందరో ఉన్నా బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ పుట్టింది మాత్రం ఫృథ్వీరాజ్ కపూర్ ఇంట్లోనే! అయితే ఆ ఘనత రాజ్ కపూర్ స్టార్డమ్తోనే ముగిసిపోలేదని రుజువు చేశాడు మరో స్టార్గా ఎదిగిన శశి కపూర్! తండ్రి, సోదరుడిలాగే నటనను మాత్రమే శ్వాసించిన శశి.. సోలో హీరోగా కంటే ఎక్కువగా మల్టీస్టార్ సినిమాల్లో నటించారు.

 
అనారోగ్యం నుంచి కోలుకుని 2015, మార్చి 18న 77వ పుట్టినరోజు వేడుక జరుపుకొన్న రాజ్ కపూర్.. వారం తిరగక ముందే మరో తీపి కబురు రుచిచూశాడు. తండ్రి, సోదరుడు సొంతం చేసుకున్న ఘనతను తాను కూడా సాధించి బాలీవుడ్కు కపూర్ కుటుంబం అందించిన సేవలను, తద్వారా లభించిన ప్రతిష్టను మరోసారి గుర్తుచేశాడు. 2014 సంత్సరపు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోనున్న ఆయన అమితాబ్ బచ్చన్తో కలిసి నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసును కొల్లగొట్టినవే! నమక్ హలాల్, దీవార్, ఇమ్మాన్ ధరం, కాలా పత్తర్, త్రిశూల్ రోటీ కపడా ఔర్ మకాన్, సుహాగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడన్ని హిట్లిచ్చారు శశీ, అమితాబ్! 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి