2.ఓపై సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదు

27 Nov, 2018 19:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎస్‌ శంకర్‌ అద్భుత సృష్టిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొంది మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముం‍దుకు రానున్న రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌ల 2.ఓపై వివాదం అలుముకుంది. ఈ మూవీలో మొబైల్‌ ఫోన్‌, టవర్లు, మొబైల్‌ సేవలపై చిత్ర రూపకర్తలు అశాస్ర్తీయ ప్రచారం చేశారని సెల్యులార్‌ ఆపరేటర్ల సంఘం (సీఓఏఐ) ఫిర్యాదు చేసింది. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ పోషించిన పాత్ర ద్వారా మొబైల్‌ ఫోన్‌ వాడకందారులను పర్యావరణానికి పక్షులు, జంతువులకు రేడియేషన్‌తో హాని చేసే వారిలా దూషిస్తుంటారని పేర్కొంది.

మొబైల్‌ ఫోన్‌లు, టవర్లు భూమిపై జీవరాశికి, మానవాళికి ప్రమాదకరమైనవిగా దుష్ర్పచారం సాగించారని సీబీఎఫ్‌సీతో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తూ సీఓఏఐ లేఖ రాసింది. టీజర్‌, ట్రైలర్‌, ఇతర ప్రమోషనల్‌ వీడియోతో పాటు సినిమా తమిళ వెర్షన్‌కు ఇచ్చన సర్టిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని ఈ లేఖలో సెన్సార్‌ బోర్డుకు విజ్ఞప్తి చేసింది.  ఈ సినిమాకు అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభమైన కొద్ది గంటలకే ఈ ఫిర్యాదు వెలుగుచూడటం గమనార్హం.

మరిన్ని వార్తలు