నా ఇంటిని ఎలా మరిచిపోతా!: నటి

25 Mar, 2017 19:28 IST|Sakshi
నా ఇంటిని ఎలా మరిచిపోతా!: నటి

న్యూఢిల్లీ: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ బాటపట్టి రాణిస్తున్న వారిలో నటి దీపికా పదుకొనే ఒకరు. హాలీవుడ్ స్టార్ విన్ డిజిల్ తో కలిసి 'ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ ఇన్ 2017' లో నటించి హాలీవుడ్‌లో తొలి మూవీతోనే పేరు తెచ్చుకుంది. అయితే అక్కడే ఉండిపోవాలన్న ఆశ తనకు లేదని అంటోంది. 'ఇది నా ఇల్లు, నేను ఎక్కడి నుంచి వచ్చాను.. నేనేంటి అనే సంగతి బాగా తెలుసు. అందుకే అలాంటి విషయాలను నేను ఎన్నటికీ మరిచిపోను' అని బాలీవుడ్ గురించి దీపికా ప్రస్తావించింది.

హాలీవుడ్ అంటే ఓ కొత్త సినీ పరిశ్రమ మాత్రమేనని.. కొత్త వాతావరణంలో మరికొందరితో నటించడేనని అభిప్రాయపడింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఓ ఈవెంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్, హాలీవుడ్ యాక్షన్ ఐకాన్ విన్ డిజిల్‌లలో బెస్ట్ అంటే ఎవరిని ఎంపిక చేస్తారన్న విలేకరుల ప్రశ్నకు అంతే తెలివిగా 'ఇద్దరూ' అని బదులిచ్చింది దీపిక. ప్రస్తుతం ఆమె సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణవీర్‌సింగ్, షాహిద్ కపూర్ కీలకపాత్రలు పోషిస్తున్న పద్మావతి మూవీలో నటిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి