ఇంతింతై ట్రెండింతై...

5 Nov, 2023 00:22 IST|Sakshi

వైరల్‌

అనగనగా ఒక జాస్మిన్‌ కౌర్‌. దిల్లీలో వస్త్ర దుకాణం నడుపుతోంది. క్లాత్‌స్టోర్‌లోకి కొత్తగా వచ్చిన పీస్‌లను ప్రమోట్‌ చేయడానికి వాటి ముందు కెమెరా పెట్టి ‘జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఏ వావ్‌’ అన్నది. ఈ మాట కాస్తా సోషల్‌ మీడియా ట్రెండై పోయింది. ‘ఇంతింతై ట్రెండింతై’ అన్నట్లు బాలీవుడ్‌ వరకు వెళ్లింది.

బెంగాలీ నటి, పార్లమెంట్‌ సభ్యురాలు నుస్రత్‌ జహాన్‌ ఈ ట్రెండ్‌కు హాయ్‌ చెప్పింది. ఇంతకుముందు బాలీవుడ్‌ నటీమణులు దీపికా పదుకోన్, సన్యా మల్హోత్రాలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వీడియోలు చేసి ‘వావ్‌’ అనిపించారు.

ఫేమస్‌ డైలాగ్‌ ‘సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్, జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఏ వావ్‌’ను లిప్‌–సింకింగ్‌ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది దీపిక. దీపిక భర్త రణ్‌వీర్‌సింగ్, డైరెక్టర్‌–ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహర్‌ ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్‌ పెట్టారు.

మరిన్ని వార్తలు