రెండేళ్ల ప్రయాణం ఇద్దరిలోకం ఒకటే

23 Dec, 2019 00:09 IST|Sakshi
జీఆర్‌ కృష్ణ, ‘దిల్‌’ రాజు, రాజ్‌ తరుణ్‌

–  ‘దిల్‌’ రాజు

‘రెండేళ్ల ప్రయాణమే ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా. కృష్ణ చెప్పిన ఐడియా నచ్చింది. ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకున్నాం కానీ కుదర్లేదు. ఆ తర్వాత రాజ్‌ తరుణ్‌తో ప్రాజెక్ట్‌ ఓకే అయింది’’ అన్నారు ‘దిల్‌’ రాజు.  జీఆర్‌.కృష్ణ దర్శకత్వంలో రాజ్‌తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా  హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘మిక్కి జె.మేయర్, సమీర్‌ రెడ్డి వంటి టాప్‌ టెక్నీషియ¯Œ ్స ఈ సినిమాకు పనిచేశారు. హీరోయిన్‌ విషయంలో ముగ్గురు, నలుగుర్ని  అనుకున్నాం.. కానీ, శిరీష్‌ మాత్రం షాలినీ పేరును చెప్పి ఒప్పించాడు.

రాజ్‌తరుణ్, షాలినీ పాండే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఫస్ట్‌ హాఫ్‌ చూసిన తర్వాత నాకు ఎక్కలేదు.. ఆ విషయాన్ని డైరెక్టర్‌కి చెప్పాను. మళ్లీ మార్పులు చేర్పులు చేసి సినిమాను చూపించాడు. ఫైనల్‌ సినిమా చూసి డైరెక్టర్‌కి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాను. ఫస్టాఫ్‌ టైమ్‌పాస్‌లా ఉంటుంది. సెకండాఫ్‌ గుడ్‌. ముఖ్యంగా క్లైమాక్స్‌ వెరీగుడ్‌ అనిపిస్తుంది. నిజాయతీగా చేసిన చిత్రమిది. ఈ ఏడాది ‘ఎఫ్‌2, మహర్షి’ తర్వాత ఈ సినిమాతో సక్సెస్‌ కొడితే హ్యాట్రిక్‌ వచ్చేసినట్టే’’ అన్నారు. ‘‘ఇదో అందమైన ప్రేమకథ. సినిమా అందరికీ నచ్చుతుంది. థియేటర్‌లోనే సినిమా చూడండి.. పైరసీని ప్రోత్సహించొద్దు’’ అన్నారు రాజ్‌ తరుణ్‌. ‘‘పుట్టుక నుండి చివరి వరకు ఇద్దరి వ్యక్తుల జర్నీ ఈ సినిమా’’ అన్నారు దర్శకుడు జీఆర్‌ కృష్ణ.  ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు