ఫుట్‌ బాల్ ఆడుతూ గాయపడ్డ హీరో

14 Mar, 2016 17:31 IST|Sakshi
ఫుట్‌ బాల్ ఆడుతూ గాయపడ్డ హీరో

ముంబై: బాలీవుడ్ హీరో డినో మొరియా గాయపడ్డాడు. ఆదివారం సాయంత్రంగా ఫుట్ బాల్ ఆడుతుండగా అతడి కాలికి గాయమైంది. త్వరగా కోలుకునేందుకు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నానని డినో మొరియా ట్విటర్ ద్వారా తెలిపాడు. కాలి గాయంతో విశ్రాంతి తీసుకోవాల్సి రావడం పట్ల నిరాశ వ్యక్తం చేశాడు. కొద్ది రోజుల పాటు తాను నడవలేనని వెల్లడించాడు.

తనను నడవనివ్వకుండా చేసిన ఫుట్ బాల్ ఆటను ఇప్పటికి ప్రేమిస్తున్నానని పేర్కొన్నాడు. తాను ఫిట్ గా ఉండడానికి కారణం ఫుట్ బాల్ ఆడడమేనని ట్వీట్ చేశాడు. తన కాలికి గాయమైన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. కాలికి కట్టుకుని కుర్చీపై పెట్టుకున్న ఫొటో పెట్టాడు. డినో మొరియా ఫొటోకు ఇన్ స్టాగ్రామ్ లో బోలెడు కామెంట్స్ వచ్చాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి