Vishal Controversial Comments: అలాంటి వాళ్లు ఇండస్ట్రీకి రావొద్దన్న విశాల్‌.. కౌంటరిచ్చిన దర్శకుడు

18 Nov, 2023 12:46 IST|Sakshi

దేవా సంగీత దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వా వరలామ్‌ వా'. ఎస్‌ జీఎస్‌ క్రియేటివ్‌ మీడియా పతాకంపై ఎస్‌ పీఆర్‌ నిర్మించారు. ఇంతకు ముందు ఐందామ్‌ తలైమురై సిద్ధ వైద్య శిఖామణి, మిసిమి, నాన్‌ అవళై సందిత్తపోదు వంటి చిత్రాలను తెరకెక్కించిన ఎస్‌జీ.రవిచంద్రన్‌ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించారు. బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షో ఫేమ్‌ బాలాజీ మురుగదాస్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. కరుమేఘంగళ్‌ కరగిండ్రన చిత్రం ఫేమ్‌ మహానా సంజీవి హీరోయిన్‌గా నటించారు.

విశాల్‌ వ్యాఖ్యలపై అసహనం
నటుడు మైమ్‌ గోపి విలన్‌గా చేస్తున్నారు. నటి గాయత్రి, రెండా, రెడిన్‌ కింగ్స్‌ లీ, శరవణ సుబ్బయ్య, దీపా, వైయాపురి వాసు విక్రమ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్‌ రాజా చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24వ తేదీ విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు ఆర్‌వీ ఉదయకుమార్‌, పేరరసు, మోహన్‌ జీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రూ.2-3 కోట్లతో సినిమాలు చేసే నిర్మాతలు ఇండస్ట్రీకి రావద్దన్న విశాల్‌ వ్యాఖ్యలపై దర్శకుడు మోహన్‌.జీ తీవ్రంగానే స్పందించారు. 

చిన్న చిత్రాలు లాభాలు తెస్తున్నాయి
మోహన్‌ జీ మాట్లాడుతూ.. విశాల్‌ ఏ ఉద్దేశంతో అలా అన్నారో గాని, నిజానికి చిన్న చిత్రాలు బాగానే లాభాలు తెచ్చి పెడుతున్నాయని తెలిపారు. తాను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రాలన్నీ లో బడ్జెట్‌లో చేసినవేనన్నారు. అన్నీ మంచి లాభాలు తెచ్చి పెట్టాయని చెప్పారు. అయితే చిత్రాలకు కంటెంట్‌ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అలాంటి ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు. తాను ఇంతకు ముందు చేసిన చిత్రాలన్నింటిలో బెస్ట్‌ చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్‌.. 'రూ.1- 4 కోట్లతో సినిమాలు తీద్దామనుకునేవారు ఇండస్ట్రీకి రావొద్దు. ఆ డబ్బుతో ఏదైనా భూమి కొనుకోండి. ఎందుకంటే అంత తక్కువ డబ్బుతో సినిమా తీస్తే మీకు ఏమీ వెనక్కు రాదు' అని కామెంట్స్‌ చేశాడు.

చదవండి: ఫ్లాప్‌ హీరో.. కొత్త డైరెక్టర్‌.. రూ.100 బడ్జెట్‌తో ‘యూవీ’ ప్రయోగం!

మరిన్ని వార్తలు