బాలీవుడ్ డైరెక్ట‌ర్ మృతి: ప్ర‌ధాని సంతాపం

4 Jun, 2020 15:13 IST|Sakshi

ముంబై: ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు బసు చ‌ట‌ర్జీ(93) క‌న్నుమూశారు. అనారోగ్య కార‌ణాల‌తో బాధ‌పడుతున్న‌ ఆయ‌న గురువారం ముంబైలోని త‌న నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయ‌న మృతి ప‌ట్ల భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విచారం వ్య‌క్తం చేశారు. "అత‌ను ప‌ని చేసిన‌ సినిమాల్లో ప్ర‌తిభ‌తో పాటు సున్నిత‌త్వం కూడా ఉంటుంది. ఇది ప్రజ‌ల‌ మ‌న‌సుల‌ను తాకుతుంది. ఆయ‌న సినిమాలు అన్ని ర‌కాల భావోద్వేగాల‌తో పాటు ప్ర‌జ‌ల పోరాటాలను ప్ర‌తిబింబిస్తాయి. అత‌ని కుటుంబానికి, అభిమానుల‌ను నా ప్ర‌గాఢ సానుభూతి" అని ట్వీట్ చేశారు. (65 ఏళ్ల వారికి షూటింగ్‌కి అనుమతి లేదు!)

ఆయ‌న మృతి ప‌ట్ల ఇండియ‌న్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ అశోక్ పండిత్ దిగ్భ్రాంతి వ్య‌క్తి చేశారు. ఆయ‌న మ‌ర‌ణం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని పేర్కొన్నారు. కాగా బ‌సు చ‌ట‌ర్జీ కార్టూనిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. అనంత‌రం సినిమాల్లో ద‌ర్శ‌క‌త్వం విభాగంలోకి ఎంట్రీ ఇచ్చి త‌క్కువ కాలంలోనే 'బాల్క‌నీ క్లాస్ డైరెక్ట‌ర్‌'గా పేరు గ‌డించారు. చ‌ట‌ర్జీ ర‌జ‌నీగంధ‌, బాతో బాతో మే, ఏక్ రుకా హువా ఫైస్లా, చిచోర్‌, పియా కా ఘ‌ర్‌, చోటీ సి బాత్, స్వామి వంటి ప‌లు బాలీవుడ్‌ సినిమాల‌కు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌లువురు సినీ స్టార్ల‌తోనూ క‌లిసి ప‌నిచేశారు. హిందీతో పాటు బెంగాలీ సి‌నిమాల‌కూ ఆయ‌న ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశారు. (సంగీత దర్శకుడు వాజిద్‌ కన్నుమూత)

మరిన్ని వార్తలు