మళ్లీ జతగా వస్తున్నారు!

30 Nov, 2015 00:00 IST|Sakshi
మళ్లీ జతగా వస్తున్నారు!

అతను కోటీశ్వరుడి కొడుకు. చెఫ్ కావాలన్నది అతని ఆశయం. అతని తండ్రికి అది నచ్చదు. స్విట్జర్లాండ్‌లో చదువుకుని, ఇండియా వచ్చి, ఓ హోటల్‌లో చెఫ్‌గా చేరతాడు. చెఫ్‌గా చేస్తున్న అతనికి ఒక అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లగలిగాడా? ఆ హోటల్‌తో అతనికి ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడటానికి కారణం ఏంటి? అనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. మలయాళంలో ఆల్‌రెడీ హిట్ పెయిర్ అనిపించుకుని, ఇటీవల ‘ఓకె బంగారం’తో మరోసారి దాన్ని నిజం చేసుకున్న దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘జతగా’ పేరుతో నిర్మాత సురేశ్ కొండేటి తెలుగులోకి విడుదల చేయనున్నారు. ‘‘ప్రేమకథ నేపథ్యంలో సాగే మంచి మ్యూజికల్ ఎంటర్‌టైనర్ ఇది. పాటలను, చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేస్తాం’’ అని సురేశ్ చెప్పారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా