18 Jun, 2018 19:52 IST|Sakshi

బిగ్‌బాస్‌-2 హౌజ్‌లోకి కొత్త ఎంట్రీ. ఎలిమినేట్‌ అయిన సంజన స్థానంలో నందిని రాయ్‌ హౌజ్‌లోకి రానున్నారు. ఇప్పటికే ఆమె ఎంట్రీకి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు వదిలారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఏవీని రిలీజ్‌ చేశారు. 27 ఏళ్ల నందిని రాయ్‌. పుట్టింది.. పెరిగింది... హైదరాబాద్‌లోనే. ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించారు. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి తక్కువ టైంలోనే అంతర్జాతీయ మోడలింగ్‌గా పేరు సంపాదించుకున్నారు. 2009లో మిస్‌ హైదరాబాద్‌ కిరీటం దక్కించుకున్నారు.  2010లో మిస్‌ ఆంధ్రప్రదేశ్‌ విన్నర్‌ కూడా.

తెలుగుతోపాటు ఓ తమిళ్‌, కన్నడ, మళయాళం చిత్రంలో ఆమె నటించారు. హిందీలో ఫ్యామిలీ ప్యాక్‌ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. తెలుగులో హర్మోన్స్‌, మాయా, మోసగాళ్లకు మోసగాడు తదితర చిత్రాల్లో నటించినట్లు చెబుతున్నారు. దివంగత నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో సినిమాల్లోకి వచ్చారంట. అమ్మాయిలంటే ధృడ సంకల్పంతో ఉండాలని, బిగ్‌బాస్‌ సీజన్‌-2లో తాను గెలిచి తీరతానన్న ధీమాతో ఆమె ఉన్నారు. మరి హౌజ్‌లో పరిస్థితులను ఆమె ఏమేర తట్టుకుంటారో చూడాలి.

మరిన్ని వార్తలు