ట్రెండ్‌ మారింది

3 Sep, 2018 01:50 IST|Sakshi
కల్యాణ్

కల్యాణ్, రిహా జంటగా కృష్ణతేజ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కల్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’. కె. శ్రీకాంత్, కె. చంద్రమోహన్‌ నిర్మిస్తున్నారు. ఆదివారం పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను వి. సాగర్, మోషన్‌ పోస్టర్‌ను నటి కవిత విడుదల చేశారు. టైటిల్‌ సాంగ్‌ను తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ రిలీజ్‌ చేసి మాట్లాడుతూ– ‘‘పవన్‌కల్యాణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని కథ తయారు చేసుకున్నారంటే ఈ సినిమా యూనిట్‌కు ఆయన పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది.

ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్‌ మారింది. ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా సక్సెస్‌ కావాలి’’ అన్నారు కవిత. ‘‘మా సినిమా రెండో షెడ్యూల్‌ త్వరలోనే ప్రారంభిస్తాం’’ అన్నారు చంద్రమోహన్‌. కృష్ణతేజ, కల్యాణ్, సంగీత దర్శకుడు జయసూర్య పాల్గొన్నారు. సాయికుమార్, పోసాని కృష్ణమురళి, భానుచందర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మహి సరళ.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పిన్న వయసులోనే దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు

హైదరాబాద్‌లో మహేష్‌ మైనపు బొమ్మ

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిన్న వయసులోనే దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు

హైదరాబాద్‌లో మహేష్‌ మైనపు బొమ్మ

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!