దర్శకురాలు కల్పనా లాజ్మి కన్నుమూత

24 Sep, 2018 00:31 IST|Sakshi
కల్పనా లాజ్మి

బాలీవుడ్‌ దర్శకురాలు కల్పనా లాజ్మి కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమె ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నిర్మాతగా, దర్శకురాలిగా, స్క్రీన్‌ రైటర్‌గా లో బడ్జెట్‌తో రియలిస్టిక్‌ చిత్రాలను రూపొందించారామె. కల్పన తెరకెక్కించినవన్నీ దాదాపు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలే. దర్శకుడు గురు దత్‌కి మేనకోడలు కల్పనా లాజ్మి. అలాగే మరో ప్రసిద్ధ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ కూడా కల్పనకు బంధువే.

‘రుడాలి, దర్మియాన్, దమన్, చింగారి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారామె. ‘రుడాలి’ సినిమాకు డింపుల్‌ కపాడియాకు, ‘దమన్‌’ సినిమాకుగాను రవీనా టాండన్‌కు నేషనల్‌ అవార్డులు లభించాయి. ‘చింగారి’ (2006) తర్వాత కల్పన సినిమాలు తీయలేదు. చివరి రోజుల్లో తన మెడికల్‌ బిల్స్‌ అన్నీ ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ డైరెక్టర్స్‌ అసోసియేషన్స్, నటుడు ఆమిర్‌ఖాన్, దర్శకుడు రోహిత్‌ శెట్టి చూసుకునేవారని సమాచారం. కల్పనా లాజ్మి మృతిపట్ల బాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు