ప్లాన్‌ బి

9 May, 2020 04:22 IST|Sakshi
ఐశ్వర్యా రాజేష్

ఫస్ట్‌ ప్లాన్‌ ఫెయిల్‌ అయితే తన దగ్గర ప్లాన్‌ బి ఉందంటున్నారు హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌. ‘యువర్స్‌ షేమ్‌ఫుల్లీ’ షార్ట్‌ఫిల్మ్స్‌ ఫేమ్‌ విఘ్నేశ్‌ కార్తీక్‌ దర్శకునిగా పరిచయం అవుతున్న తమిళ చిత్రం ‘దిట్టమ్‌ ఇరండు’లో కథానాయికగా నటిస్తున్నారామె. ‘ప్లాన్‌ బి’ అనేది ఉపశీర్షిక.  లాక్‌ డౌన్‌కు ముందే ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఈ సినిమా గురించి ఐశ్వర్య మాట్లాడుతూ– ‘‘విఘ్నేశ్‌ తీసిన షార్ట్‌ ఫిల్మ్స్‌ చూసి అతనితో మాట్లాడాను.

నేను తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ ది క్రికెటర్‌’ అనే చేస్తున్న సమయంలో ‘దిట్టమ్‌ ఇరండు’ గురించి విఘ్నేశ్‌ చెప్పారు. కథ నచ్చి ఒప్పుకున్నాను. ఇందులో నా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఇదేదో సూపర్‌ ఉమెన్‌ సినిమా కాదు. వచ్చిన అపాయాలను తన ఉపాయాలతో ఓ మామూలు అమ్మాయి ఎలా పరిష్కరించింది? అన్నదే కథాంశం. స్క్రిప్ట్‌లోని ఊహించని మలుపులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి’’ అన్నారు విఘ్నేశ్‌.   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు