అమ్మాయి ప్రతీకారం!

26 Aug, 2016 23:34 IST|Sakshi
అమ్మాయి ప్రతీకారం!

‘‘భిన్నమైన కథలు, కథనాలతో రూపొందుతున్న ‘దృశ్యం’లాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ చిత్రదర్శకు రాలు శ్రీప్రియ నుంచి వస్తున్న మరో విభిన్నమైన చిత్రమిది. ఇప్పటివరకూ చేయని పాత్రను ఇందులో చేశాను’’ అన్నారు సీనియర్ నరేశ్. నిత్యామీనన్, క్రిష్ జె.సత్తార్, నరేశ్ ముఖ్య తారలుగా శ్రీప్రియ దర్శకత్వంలో వీఆర్ క్రిష్ణ యం. నిర్మిం చిన చిత్రం ‘ఘటన’. శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. వీఆర్ క్రిష్ణ మాట్లాడుతూ - ‘‘ఓ అమ్మాయి తనకు జరిగిన అన్యాయంపై ఎలా ప్రతీకారం తీర్చు కుందనేది కథ.  ఆగస్టు 31న ప్లాటినమ్ డిస్క్ వేడుక, సెప్టెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.