అభిమానాన్ని కొత్తగా ఎక్స్‌ప్రెస్‌ చేశాడు..

23 Nov, 2018 10:37 IST|Sakshi

సినిమా: హన్సిక నా జీవితం అనగానే ఇదేదో సినిమా టైటిల్‌ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇది ఒక వీరాభిమాని నటి హన్సికపై కురిపించిన ప్రేమ. ఇప్పుడు పెద్దగా ఫేమ్‌లో లేకపోయినా ఒకప్పుడు యమ క్రేజీ హీరోయిన్‌ హన్సిక. అలాగని ఇప్పుడు ఈ అమ్మడికి అవకాశాలు లేవనికాదు. తమిళంలో మూడు, తెలుగులో బిజీగానే ఉంది. మరి అలాంటి బ్యూటీకి అభిమానుల సంఖ్య తక్కువేమీ ఉండదుగా. వారిలో వీరాభిమానులు ఉంటారు. అదుగో అలాంటి ఒక అభిమానినే ఇటీవల హన్సికపై తన అభిమానాన్ని కొత్తగా ఎక్స్‌ప్రెస్‌ చేశాడు. అదెలాగంటే హన్సిక నా జీవితం అంటూ ఏకంగా 28 భాషల్లో రాసి అదే పేరుతో ఫేస్‌బుక్‌ను ఓపెన్‌ చేసి తన వీరాభిమానం హన్సికకు తెలిసేలా పోస్ట్‌ చేశాడు.

అందులో హన్సిక నా జీవితం అంటూ తెలుగులో, హన్సిక మై లైఫ్‌ అని ఆంగ్లంలో, హన్సిక ఎన్‌ వాళ్‌క్కై అని తమిళంలో ఇలా ఇదే అర్థం వచ్చే విధంగా 28 భాషల్లో రాశాడు. దీంతో యమ ఖుషీ అయిపోయిన నటి హన్సిక వావ్‌ ఇది విభిన్నంగా బాగుంది. చాలా ధన్యవాదాలు అని ఆ అభిమానికి రిప్‌లై ఇచ్చింది. హన్సిక స్పందనతో తెగ ఆనందపడిపోయిన ఆ అభిమాని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అంతే కాదు తన కోరికను వెలిబుచ్చాడు. హన్సిక ఇటీవల బాగా కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైంది కానీ ఇంతకుముందు బొద్దుగా ముద్దుగా ఉండేది. అందుకే చిన్న కుష్బూ అని కూడా పిలిచేవారు. ఇప్పుడీ అభిమానికి హన్సిక సన్నగా బక్క చిక్కిపోవడం నచ్చలేదట. మునుపటిలానే ఉండాలనే కోరికను వ్యక్తం చేశాడు. మరి తనపై అభిమానాన్ని 28 భాషల్లో రాసి మరీ వ్యక్తం చేసిన అభిమాని కోరికపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ విక్రమ్‌ప్రభుతో జత కట్టిన తుపాకీ మునై చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తోంది. అదే విధంగా 50వ చిత్రం మహా చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు