షూటింగ్‌లో ప్రమాదం.. హీరో నానికి గాయాలు!

29 Jan, 2019 15:57 IST|Sakshi

ఇటీవల సక్సెస్‌ల విషయంలో కాస్త తడబడుతున్న యంగ్ హీరో నాని ప్రస్తుతం జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. క్రికెట్‌ నేపథ్యంలో పిరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రకీరిస్తుండగా నాని గాయపడినట్టుగా తెలుస్తోంది.

క్రికెట్‌ బాల్‌ నాని ముఖానికి తగలటంతో ముక్కుకు, చెంపకు గాయమైంది. అయితే గాయాలు అంత పెద్దవి కాదని, కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం నాని తిరిగి షూటింగ్ కు హజరవుతారని చిత్ర సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాతో కన్నడ బ్యూటీ శ్రద్ధాశ్రీనాథ్ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ సినిమాలో క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కించనున్న సన్నివేశాల్లో పలువురు ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌ నటించనున్నారట.

మరిన్ని వార్తలు