అందరికీ నచ్చేలా... శివగంగ

9 Nov, 2015 00:01 IST|Sakshi
అందరికీ నచ్చేలా... శివగంగ

రెండు ఆత్మలు పగ తీర్చుకునే కథాంశంతో తమిళంలో వీసీ వడి ఉదయన్ దర్శకత్వంలో  హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘శౌకార్‌పెట్టై’ . రాయ్‌లక్ష్మీ, శ్రీరామ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శివగంగ’ పేరుతో ఎస్. కుమార్ బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ పతాకంపై కె.శివనాథ్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగులో అందిస్తున్నారు జాన్‌పీటర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి ఆవిష్కరించారు.

శ్రీరామ్ మాట్లాడుతూ-‘‘  తెలుగు ప్రేక్షకులు కొత్త దనాన్ని ప్రోత్సహిస్తారనే విషయాన్ని నా  ‘రోజాపూలు’ సినిమా హిట్ చేసి నిరూపించారు. నేను మొదటి సారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘ఇప్పటివరకూ ఎన్నో హారర్ మూవీస్ చేశాను. కానీ తొలిసారి దెయ్యం ఆవహించిన పాత్ర చేశాను.

ఈ చిత్రానికి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్’’ అని రాయ్ లక్ష్మీ అన్నారు. సినిమా అందరికీ నచ్చేలా రూపొందించామనీ, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, విద్యుత్ శాఖా మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి