'సంగీతాన్నికంపల్సరీ చేయండి'

22 Nov, 2015 13:31 IST|Sakshi
'సంగీతాన్నికంపల్సరీ చేయండి'

ప్రపంచ వ్యాప్తంగా హింసను తగ్గించాలంటే పాఠశాలలో, కళాశాలలో సంగీతాన్ని నిర్భంద విద్యగా ప్రవేశపెట్టాలని అన్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. గోవాలో జరగుతున్న ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంగీతంలో దశాబ్దాల అనుభవం ఉన్న ఇళయరాజ, స్వరాల్లో ఉన్న దైవత్వం హింసను జయించగలదని,అందుకే విద్యార్థులకు సంగీతాన్ని నేర్పించాలన్నారు.

దాదాపు భారతీయ భాషలన్నింటిలో ఎన్నో అద్భుత గీతాలను స్వరపరిచిన మేస్ట్రో వెయ్యి సినిమాలకు సంగీతం అందించిన మైళురాయికి చేరువలో ఉన్నారు. ఇప్పటికే నాలుగు నేషనల్ అవార్డ్స్తో పాటు, పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్న ఇళయరాజాను వేదికపై నిర్వాహకులు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్తో సత్కరించారు.