ఇలియానా తొలిసారిగా..!

8 Nov, 2018 15:43 IST|Sakshi

చాలా రోజులుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న గోవా బ్యూటి ఇలియానా అమర్‌ అక్బర్‌ ఆంటొని సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమాలో తన పాత్రకు ఇలియానా స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు. ఇటీవల పరభాషా హీరోయిన్లందరు తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పుకోవటం కామన్ అయిపోయింది. ఇప్పటికే కీర్తి సురేష్‌, తమన్నా, పూజ హెగ్డే లాంటి హీరోయిన్స్‌ ఓన్‌ వాయిస్‌తో ఆకట్టుకోగా తాజాగా ఈ లిస్ట్‌లో ఇలియానా కూడా చేరనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న అమర్‌ అక్బర్ ఆంటొని నవంబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు