ప్రేమలో గీతాశంకరం

11 Nov, 2023 03:15 IST|Sakshi
ప్రియాంక, ముఖేష్‌ గౌడ

ముఖేష్‌ గౌడ, ప్రియాంకా శర్మ జంటగా కె.దేవానంద్‌ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘గీతా శంకరం’. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ముఖేష్‌ గౌడ మాట్లాడుతూ– ‘‘సీరియల్స్‌లో పేరు సంపాదించుకున్నట్లే ఈ సినిమాతో వెండితెరపై కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు. 

‘‘నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్ర లభించడం నా లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు ప్రియాంకా శర్మ. ‘‘ఇరవై కథలు విన్నాం. కానీ రుద్ర చెప్పిన ఈ కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ నెల 14న కొత్త షెడ్యూల్‌ ఆరంభిస్తాం’’ అన్నారు దేవానంద్‌. ‘‘ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు రుద్ర. ఈ చిత్రానికి సంగీతం: అబు, కెమెరా: ఉదయ్‌ ఆకుల.

మరిన్ని వార్తలు