-

అనుమతి లేకుండా నా పాటలు పాడొద్దు

29 Nov, 2018 00:02 IST|Sakshi
ఇఇళయరాజా

నా అనుమతి లేకుండా నా పాటలు పాడారంటూ సంగీత దర్శకుడు ఇళయరాజా  గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నోటీసులు జారీ చేసిన విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇలాంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఇళయరాజా. ‘‘నేను కంపోజ్‌ చేసిన పాటలు పాడుతున్న గాయకులందరకీ ఇదే నా విన్నపం. నా పాటలు పాడొద్దని మీకు చెప్పడం లేదు. కానీ, పాడే ముందు నా అనుమతి తీసుకోండి.. తీసుకోకపోతే మాత్రం నేరం. నా అనుమతి లేకుండా నా పాటలు పాడితే మ్యుజీషియన్స్‌తో పాటు బ్యాండ్‌ సభ్యులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.

అంతేకాదు.. నేను ఐపీఆర్‌ఎస్‌(ఇండియన్‌ పెర్ఫార్మింగ్‌ రైట్స్‌ సొసైటీ)లో సభ్యుడిని కాకున్నా నా పాటలు పాడుతున్న వారి నుంచి రాయల్టీ ఫీజును ఐపీఆర్‌ఎస్‌ వసూలు చేస్తోంది. ఇకపై అలా జరగకూడదు. ఆ ఫీజు ‘దక్షిణ సినిమా సంగీత కళాకారుల సంఘం’ సేకరిస్తుంది. మీరు పాటలు పాడటానికి డబ్బులు తీసుకుంటారు? ఉచితంగా పాడటం లేదు కదా? మరి నా పాటలు పాడుతూ మీరు డబ్బులు తీసుకోవడం కరెక్టేనా? నాకూ వాటా రావాల్సిన అవసరం లేదా? నేను అడుగుతోంది కొంచెం డబ్బు మాత్రమే. భవిష్యత్‌ తరాలకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు