-

Bigg Boss 7 Day 84 Highligts: ఎలిమినేట్ అవుతానని రతికకి ముందే తెలుసు.. కానీ ఆ విషయంలో!

26 Nov, 2023 23:00 IST|Sakshi

బిగ్‌బాస్ 7లో మరో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. కాకపోతే ఈసారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అశ్వినితో పాటు బిగ్‌బాస్‌కి ఎంతో ఇష్టమైన రతిక ఎలిమినేట్ అయిపోయింది. తనని రెండోసారి కూడా బయటకు పంపేస్తారని రతికకి ముందే తెలుసు. ఎలిమినేషన్‌తో పాటు సండే ఎపిడోస్‌లో ఇంకా ఏమేం జరిగాయనేది Day 84 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!)

శివాజీ గురించి నిజం
అశ్విని ఎలిమినేట్ కావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఆమె స్టేజీపైకి రావడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అయితే హస్‌లో ఉన్నవాళ్లలో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అనేది చెప్పాలని నాగ్ అడగ్గా.. అలా కాదు హిట్, సూపర్‌హిట్ ఎవరనేది చెబుతానని అశ్విని చెప్పింది. రతిక-ప్రియాంక ఫ్లాప్ అని చెప్పిన అశ్విని, అమర్-గౌతమ్-శోభాశెట్టి-శివాజీ హిట్ అని చెప్పింది. ప్రశాంత్-అర్జున్-యావర్ మాత్రం సూపర్‌హిట్ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. అయితే శివాజీ గురించి చెప్పిన అశ్విని.. ఆయన కొందరి వరకు మాత్రమే పరిమితమైపోయారని నిజాన్ని చెప్పింది. దీన్ని తీసుకోలేకపోయిన సోఫాజీ అలి.యాస్ శివాజీ.. నువ్వు అలా అనుకుంటున్నావ్ అని ఏదేదో చెప్పి కవర్ చేశాడు.

చుక్క బ్యాచ్ vs ముక్క బ్యాచ్
అయితే అశ్విని మాట్లాడుతున్నప్పుడు ప్రస్తుతం హౌస్‌లో రెండు గ్రూప్స్ ఉన్నాయని చెప్పింది. ఇది నిజమేనని ఒప్పుకొన్న నాగార్జున.. అమర్-శోభా-ప్రియాంకలని కలిపి 'చుక్క బ్యాచ్' అని.. శివాజీ-యావర్-ప్రశాంత్‌లని కలిపి 'ముక్క బ్యాచ్' అని చెప్పాడు. అయితే ఇన్నాళ్లు బయట అనుకున్నది స్వయంగా నాగార్జున చెప్పడంతో.. గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని నిర్వహకులే ఒప్పుకొన్నట్లు అయింది. ఆ తర్వాత ఇంట్లో వస్తువుల గురించి, వస్తువులతో పాటల గురించి టాస్క్స్ పెట్టారు. ఇదంతా టైమ్ పాస్ పల్లీ బఠాణీ వ్యవహారంలా అనిపించింది తప్పితే అలరించలేకపోయింది.

(ఇదీ చదవండి: లవర్‌ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!)

రతిక ముందే పసిగట్టింది
శనివారం అశ్విని ఎలిమినేట్ కాగా.. మిగిలిన ఏడుగురిలో ఆదివారం వరసగా అమర్, గౌతమ్, ప్రశాంత్, యావర్, శివాజీ సేవ్ అ‍య్యారు. చివరగా అర్జున్, రతిక మిగిలారు. అయితే వీళ్లిద్దరిలో ఎవరికైనా ఎవిక్షన్ పాస్ ఉపయోగిస్తావా ప్రశాంత్? అని నాగ్ అడగ్గా.. తాను 14వ వారం మాత్రమే దీన్ని ఉపయోగిస్తానని ఖరాఖండీగా చెప్పేశాడు. ఆ తర్వాత కాసేపు సస్పెన్స్ మెంటైన్ చేసి రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. వెళ్తూ వెళ్తూ శోభాతో రతిక మాట్లాడుతూ.. బహుశా ఆడట్లేదని నన్ను తీసేశారేమో అని తనలో తానే అనుకుంది. ఇక స్టేజీపై వచ్చిన తర్వాత 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' అని పాట పాడి అందరికీ సెండాఫ్ చెప్పేసింది.

ఎలిమినేషన్‌కి అదే కారణం
ఈ వారం నామినేట్ అయినప్పుడే రతిక.. తన ఎలిమినేషన్ విషయాన్ని పసిగట్టింది కానీ దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ఒకవేళ ఈ వారం టాస్క్ గెలిచి ఎవిక్షన్ పాస్ గెలుచుకుని ఉంటే కచ్చితంగా సేవ్ అయ్యేది. తొలుత నాలుగు వారాలు ఉన్నప్పుడు సోది ముచ్చట్లు పెట్టింది. దీంతో ఎలిమినేట్ చేసి ఇంటికి పంపేశారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐదు వారాలు ఉంది. కానీ గేమ్స్ ఆడే విషయంలో అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎప్పుడు చూడు శివాజీకి చెంచాగిరి చేయడమే సరిపోయింది. ఇలా పలు కారణాల వల్ల రతిక ఎలిమినేట్ అయిపోయింది. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?)

మరిన్ని వార్తలు