ఈ ప్రేమలో అన్నీ ఎక్కువే

10 Mar, 2014 23:56 IST|Sakshi
ఈ ప్రేమలో అన్నీ ఎక్కువే

అనూజ్‌రామ్, శ్రీముఖి జంటగా వెంకట్ వర్థన్ దర్శకత్వంలో అపురూప్ (శివ), గంప సిద్ధలక్ష్మి నిర్మించిన చిత్రం ‘ఈ ప్రేమలో అన్నీ ఎక్కువే’. ఇటీవలే ఈ చిత్రం పాటలను విడుదల చేశారు. ఆడియో ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో కువైట్‌లో వేడుక జరిపారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘మంచి పాటలివ్వడానికి స్కోప్ ఉన్న చక్కని ప్రేమకథ ఇది. వలీషా బాబ్జీ మంచి స్వరాలిచ్చారు. సోషల్ నెట్‌వర్క్ ద్వారా ప్రపంచంలోని అందరికీ పాటలు రీచ్ అయ్యేలా చేశాం’’ అన్నారు. చేజర్ల ఇంద్రకుమార్, అలీ పాల్గొ న్నారు.