240 కోట్ల ఫైట్

28 Sep, 2015 23:48 IST|Sakshi
240 కోట్ల ఫైట్

జేమ్స్ బాండ్ చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. మామూలుగా ఛేజింగుల కోసం కార్లను ధ్వంసం చేయాల్సి వస్తే గ్రాఫిక్స్ లేదా డూప్ కార్లు వాడతారు. కానీ, డేనియల్ క్రెగ్ నటిస్తున్న లేటెస్ట్ జేమ్స్ బాండ్ ఫిల్మ్ ‘స్పెక్టర్’ కోసం ఏకంగా ఏడు కార్లను ధ్వంసం చేశారు. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా!

యాక్షన్ సన్నివేశాల కోసం చిత్ర బృందం ఏకంగా ఏడు ఆస్టన్ మార్టిన్ కార్లు  వాడింది. ఆస్టన్  మార్టిన్ అంటే కేవలం సంపన్నులకే పరిమితై మెన ఖరీదైన కారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ‘డిబి 10’ స్పోర్ట్స్ కార్లుగా వీటిని తయారు చేశారు. ఈ కారు ధర మన కరెన్సీలో 4 కోట్ల పైచిలుకే. సినిమా బడ్జెట్ రూ. 2 వేల కోట్లయితే, ఈ కార్ల ఫైట్‌కైన ఖర్చు అక్షరాలా 240 కోట్లు. మొత్తానికి, గడచిన 53 ఏళ్ల బాండ్ ఫిల్మ్స్ చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా ‘స్పెక్టర్ ’ నిలిచిపోనుంది.