ఇండియన్‌ ఫస్ట్‌ స్పేస్‌ మూవీ ట్రైలర్‌

25 Nov, 2017 10:34 IST|Sakshi

సాక్షి, సినిమా : దేశంలోని తొలి స్పేస్‌ చిత్రం టిక్‌ టిక్‌ టిక్‌ ట్రైలర్‌ వచ్చేసింది. కోలీవుడ్‌లో జయం రవి హీరోగా శక్తి సౌందర్‌ రాజన్‌ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అంతరిక్షం నేపథ్యంలో అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు విజువల్స్‌ చూస్తే అర్థమౌతోంది.

భారతదేశానికి పొంచి ఉన్న ముప్పు.. దానిని అడ్డుకునేందుకు అంతరిక్ష శాఖ అధికారులు మేజిషియన్‌ అయిన హీరో సాయం తీసుకోవటం.. ఓ బృందంగా అంతరిక్షంలోకి వెళ్లి శత్రువులతో పోరాటం నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కింది. గ్రాఫిక్స్‌ వర్క్‌ కూడా ఆసక్తికరంగానే ఉంది. నివేథా పెతురాజ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇమాన్‌ సంగీతం అందిస్తున్నాడు.
 
ప్రయోగాత‍్మక చిత్రాలకు ముందుండే జయం రవి నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ సినిమానే రాబోతుందని స్పష్టమౌతోంది. కాగా, టిక్‌ టిక్‌ టిక్‌ రిలీజ్‌ తేదీ ప్రకటించాల్సి ఉంది. గతంలో రవి-రాజన్‌ కాంబినేషన్‌లో మిరుథన్‌(తెలుగులో యమపాశం) జాంబీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు