డిటెక్టివ్‌?

6 Nov, 2017 00:16 IST|Sakshi

లాంగ్‌ కోట్, తలకు హ్యాట్, మెలితిరిగిన మీసాలు... జనరల్‌గా డిటెక్టివ్‌ అంటే ఈ లుక్‌లోనే ఊహించుకుంటాం. ఓసారి ఎన్టీఆర్‌ని ఈ లుక్‌లో ఊహించి చూడండి. గెటప్‌ అదిరింది కదూ! ఏ సినిమాలో ఎన్టీఆర్‌ ఈ లుక్‌లో కనిపించనున్నారంటే.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలో అని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. 1980లలో వచ్చిన ఓ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్‌ ఆ నవల హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం.

వాస్తవానికి ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర చేయనున్నారనే వార్త వచ్చింది. అయితే, త్రివిక్రమ్‌ రైట్స్‌ తీసుకున్న నవల డిటెక్టివ్‌ బేస్డ్‌ అట. అందుకని, ఎన్టీఆర్‌ చేయబోతున్నది డిటెక్టివ్‌ పాత్ర అని చాలామంది ఫిక్సయ్యారు. ఎన్టీఆర్‌ కోసమే త్రివిక్రమ్‌ ఆ నవల తీసుకున్నారా? లేక వేరే సినిమాకా? అనేది త్వరలోనే తెలుస్తుంది. అన్నట్లు... త్రివిక్రమ్‌ గత చిత్రం ‘అ ఆ’ కూడా ఓ నవల ఆధారంగా రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా