తప్పులో కాలేసిన జూహి చావ్లా

13 Oct, 2017 11:12 IST|Sakshi

ప్రముఖ హీరోయిన్‌ జూహి చావ్లా తప్పులో కాలేశారు. టపాసుల నిషేధంపై ఆమె చేసిన ట్వీట్‌ ఇంటర్నెట్‌లో పంచ్‌ పటాకులు పేలుస్తోంది. టపాసుల నిషేధాన్ని సమర్థిస్తూ... నవంబర్‌ 1 వరకు ఫైర్‌క్రాకర్స్‌ నిషేధిస్తూ 'ఢిల్లీ సుప్రీంకోర్టు' అద్భుత నిర్ణయం తీసుకుందని, ప్రేమ, దీపాలుతో ఈ సారి దివాలిని సెలబ్రేట్‌ చేసుకుందామంటూ జూహి చావ్లా ట్వీట్‌ చేశారు. ఆమె సుప్రీంకోర్టును కేవలం ఢిల్లీదే అనడంపై ట్విట్టరియన్లు జోకులు పేలుతున్నారు.  ముంబై సుప్రీంకోర్టు కూడా టపాసులను బ్యాన్‌ చేసిందా? లేదా? అంటూ ఒక ట్విట్టరియన్‌ జూహిని అడిగాడు. 

దేశంలో ఎన్ని సుప్రీంకోర్టులు ఉన్నాయి. ఇది ఢిల్లీ సుప్రీంకోర్టు నిర్ణయమైతే, మరోకటి ఎక్కడ? అని, ఇది దేశానికి సుప్రీంకోర్టు అని, ఢిల్లీకి కాదు అని మరోకరు ఇలా... జూహికి కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. దేశానికి ఒకటే సుప్రీంకోర్టు ఉంటుంది మేడమ్‌ అంటూ మరికొందరు జనరల్‌ నాలెడ్జ్‌ నేర్పుతున్నారు. టపాసుల నిషేధంతో ప్రతి రాష్ట్రానికి ఒక సుప్రీంకోర్టు వచ్చిందని, థ్యాంక్యూ బ్యాన్‌ అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. ఇలా జూహి చావ్లా ట్వీట్‌కు పెద్ద ఎత్తునే ప్రతి ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. 

గతేడాది నవంబర్‌ 11నే సుప్రీంకోర్టు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో టపాసుల విక్రయాలు, హోల్‌సేల్‌, రిటైల్‌ వంటి వాటి లైసెన్సుల రద్దును సమర్థించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో నవంబర్‌1 వరకు ఎలాంటి టపాసులు అమ్మకూడదని గత వారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. 

మరిన్ని వార్తలు