నాతో పెళ్లా..అయితే ట్రై చెయ్‌: హీరోయిన్‌

23 Sep, 2019 11:19 IST|Sakshi

నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతున్నావా. అయితే ప్రయత్నించు అని హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరో గానీ, హీరోయిన్‌గానీ వరుసగా రెండు మూడు అపజయాలను చవిచూసినా ఆ తరువాత ఒక్క విజయం వస్తే గత అపజయాలన్నీ తుడిచి పెట్టుకుపోతాయి. నటి కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుత పరిస్థితి ఇదే. ఇటీవల ఈ బ్యూటీ  తెలుగు, తమిళ భాషల్లో నటించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. అలాంటి సమయంలో తమిళంలో జయంరవితో రొమాన్స్‌ చేసిన కోమాలి చిత్రం మంచి సక్సెస్‌ కావడంతో కాజల్‌అగర్వాల్‌ మానసికానందంతో మతాబులా వెలిగిపోతోంది. నిజానికి ఈ చిత్రంలో ఈ అమ్మడి పాత్ర పరిధి చాలా పరిమితమే. అది కాదిక్కడ ముఖ్యం సక్సెస్‌ వచ్చిందా? లేదా? అన్నదే కౌంటవుతుంది. ఆ సంతోషంతో నటి కాజల్‌అగర్వాల్‌ ఇటీవల తన ఫేస్‌బుక్‌లో అభిమానులను పలకరించి వారి ప్రశ్నలు బదులిచ్చింది. అలా పలువురు అభిమానుల ప్రశ్నలకు ఎంతో సహనంగా సమాధానాలను ఇచ్చింది.

అయితే పురుషుల్లో పుణ్య పురుషులు వేరయా! అన్నట్లు, అభిమానుల్లో వీరాభిమానులు ఉంటారు కదా! అలా ఒక అభిమాని ‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతున్నాను’ అన్నాడు. అంతే ఇంతకుముందు అందరి ప్రశ్నలకు టక్కు టక్కున బదులిచ్చిన కాజల్‌ ఈ అభిమాని వ్యాఖ్యలకు మాత్రం అవాక్కయ్యింది. వెంటనే బదులివ్వలేక మౌనం వహించింది. కొంత సేపు తరువాత అందుకు ప్రయత్నించండి. అయితే అది అంత సులభమైన విషయం కాదు అని పేర్కొంది. అందుకు తెగ సంబరపడిపోయిన ఆ అభిమాని వెంటనే ప్రయత్నిస్తూనే ఉన్నాను అని బదులిచ్చాడు. తనకు ఇదో వింత అనుభవం అని కాజల్‌ పేర్కొంది. కాగా ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదన్న విషయం తెలిసిందే. దీంతో  అలాంటి అభిమానులు ఎందరు ఈ బ్యూటీపై తమ ప్రేమను వ్యక్తం చేస్తారో చూడాలి. ఇకపోతే కాజల్‌అగర్వాల్‌ ప్రస్తుతం కమలహాసన్‌కు జంటగా శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తోంది. త్వరలో సూర్యకు జంటగా నటించడానికి సిద్ధం అవుతోంది. అదేవిధంగా ఒక హిందీ చిత్రం ఈ అమ్మడి చేతిలో ఉంది. అలా నటిగా కాజల్‌అగర్వాల్‌ బిజీగా ఉందన్నమాట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా