85 ఏళ్ల బామ్మగా కాజల్‌.. ఇది ఫిక్స్‌

17 Jan, 2020 09:16 IST|Sakshi

ఇండియన్‌ 2 చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది నటి కాజల్‌ అగర్వాల్‌ బయట పెట్టేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయాన్నీ దర్శకుడు శంకర్‌ బయట పెట్టరాదని కండిషన్‌ పెట్టారని చెబుతూనే తన పాత్ర గురించి స్పష్టంగా చెప్పేశారు. దక్షిణాదిలో అగ్ర నటిగా వెలిగిన కాజల్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్న ఈ బ్యూటీ ఎంతో ఆశలు పెట్టుకున్న చిత్రం ఇండియన్‌–2. కారణం కమలహాసన్‌తో తొలిసారిగా జత కట్టడం. దీన్ని స్టార్‌ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించడం. 

ఇండియన్‌–2 చిత్రంలో ఎప్పుడెప్పుడు నటిద్దామా..? అని ఎదురు చూసిన కాజల్‌ ఇటీవల ఆ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ అనుభవాలను చెబుతూ ఇండియన్‌–2 చిత్రం విడుదలైన తరువాత తన ఇమేజ్‌ వేరే లెవల్‌కు చేరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నటించాలని దర్శకుడు శంకర్‌ తనను సంప్రదించినప్పుడు ఎలాంటి పాత్రను ఇస్తారోనని బయపడినట్లు తెలిపారు. ఆ తరువాత ఇండియన్‌–2 చిత్రంలో తన పాత్ర 85 ఏళ్ల బామ్మదని తెలిసిందని పేర్కొన్నారు. ఈ పాత్రకు తాను న్యాయం చేయగలనా? అన్న సందేహం కలిగిందని ఇప్పుడా సందేహం పటాపంచలు అయిపోయిందని చెప్పారు. 

కారణం ఇండియన్‌–2 చిత్రంలో కమలహాసన్‌ పోషిస్తున్న పాత్ర తరువాత అంతగా చెప్పుకోదగ్గ పాత్ర తనదేనని తెలిసిందన్నారు. అందుకే ఈ పాత్ర కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నటిస్తున్నట్లు చెప్పారు. ఈ పాత్రకు మేకప్‌ కోసమే అనేక గంటలు పడుతోందని అంది. దానిపై అంతగా శ్రద్ధ చూపడానికి కారణం అంత ప్రాముఖ్యత కలిగిన పాత్ర అని పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ తదుపరి షెడ్యూల్‌ పిబ్రవరిలో మొదలవుతుందని అన్నారు. 

ఈ చిత్రం గురించి ఇంకేమీ బయటకు చెప్పరాదన్నది దర్శకుడు శంకర్‌ నిబంధన అని చెప్పింది. కాబట్టి ఇప్పటికి ఈ చిత్రం గురించి ఏమీ చెప్పలేనని కాజల్‌ పేర్కొంది. అన్నట్టు ఈ బ్యూటీకి మరో అవకాశం తలుపు తట్టిందన్నది తాజా సమాచారం. మలయాళ యువ నటుడు దుల్కర్‌ సల్మాన్‌తో జత కట్టడానికి సిద్ధమవుతోందని టాక్‌. తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా