అప్పుడు అందరి కళ్లు అనుష్క శర్మ డ్రెస్‌ మీదే..!

17 Nov, 2023 12:06 IST|Sakshi

ప్రముఖ భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ మెస్మరైజ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో భారీగా వైరల్‌ అవుతున్నాయి. వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడుతున్న మ్యాచ్‌ను చూసేందుకు ఆమె ముంబైకి వచ్చింది. ఆట జరుగుతున్నప్పుడు క్రీజ్‌లో విరాట్‌ దుమ్ములేపుతుంటే.. స్టాండింగ్‌లో ఉన్న అనుష్క చప్పట్లు కొడుతూ.. అప్పడప్పుడు విరాట్‌కు ఫ్లయింగ్‌ కిస్‌లు ఇస్తూ సంతోషంగా కనిపించింది. ఆ సమయంలో కెమెరాలు కూడా ఆమెను పదేపదే స్క్రీన్‌పై చూపించాయి.  

తాను మైదానంలో వేలాదిమంది మధ్యలో ఉన్నానని సంగతి మర్చిపోయి, ఎంతో ఉత్సాహంతో ఆ సందర్భాన్ని ఎంజాయ్‌ చేసింది. వాంఖడే స్టేడియంలో విరాట్‌ ఆట ఎంత హిట్టో.. ఆ సమయంలో ఉత్సాహంగ కనిపించిన అనుష్క నవ్వులు కూడా అంతే హిట్‌ అయ్యాయి. అప్పుడు అందరి దృష్టి ఆమె డ్రెస్‌పై పడింది. అనుష్క ఈ మ్యాచ్ కోసం కో-ఆర్డ్ సమిష్టిలో అద్భుతంగా కనిపించింది. అనుష్క ప్రస్తుతం ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు, కానీ ఆమె తన స్టైలిష్ ప్రదర్శనలతో తన అభిమానులను ఎలా ఆకర్షించాలో ఖచ్చితంగా తెలుసు. ఆకుపచ్చ పూల డిజైన్‌లతో ఉన్న షర్ట్‌లో ఆమె చాలా అందంగా కనిపించింది.

అనుష్క శర్మ దుస్తులు ధృవ్ కపూర్ లేబుల్ నుంచి వచ్చాయి. ఫ్లోరల్ డిజైన్‌తో కూడిన ఆ షర్ట్ ధర రూ.19,500 కాగా షర్ట్, మ్యాచింగ్ షార్ట్‌లతో కూడిన కో-ఆర్డ్ సెట్‌ మొత్తం కావాలంటే రూ. 27,500 అని తెలుస్తోంది. తాజాగా విరాట్‌ చేసిన సెంచరికి ఒక ప్రత్యేకత ఉంది. 50 సెంచరీలతో టాప్‌ ప్లేస్‌లోకి చేరడం.. ఆ సమయంలో అనుష్క ఇచ్చిన ఫ్లయింగ్‌ కిస్‌లు ఇలా అన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీంతో అనుష్క ధరించిన డ్రెస్‌ ఎంత ఉండవచ్చని సోషల్‌ మీడియాలు భారీగా కామెంట్లు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు