సౌత్‌ పాపులర్‌ హీరోకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన కంగనా

30 Oct, 2023 07:32 IST|Sakshi

బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రనౌత్‌. వివాదాస్పద నటిగా ముద్రవేసుకున్న ఈ భామ నటిగా మాత్రం బిజీబిజీగా ఉన్నారు. దర్శకురాలిగా, నిర్మాతగాను రాణిస్తున్న కంగనారనౌత్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇందులో ఆమె దివంగత ప్రధాని ఇందిరా గాంధీగా నటిస్తున్నారు. కాగా కంగనారనౌత్‌ తాజాగా నటించిన తేజాస్‌ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది.

ఇక తమిళంలోనూ మంచి క్రేజ్‌ ఉన్న ఈమె ఇటీవల తమిళంలో నటించిన చంద్రముఖి–2 చిత్రం విడుదల కావడం, ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావడం జరిగిపోయింది. చంద్రముఖి–2 చిత్రం ప్రచారం అంతా ఈమైపెనే జరిగినా, చిత్రంలో కనిపించింది మాత్రం ఇంటర్వెల్‌ తరువాతనే. ఇదే ప్రేక్షకులను నిరాశ పరిచిన విషయం.

కాగా తరచూ వార్తల్లో ఉండే కంగనారనౌత్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాలు కాకుండా మరో మూడు చిత్రాలు అంగీకరించినట్లు చెప్పారు. అందులో అను వెడ్స్‌ మను చిత్రానికి సీక్వెల్‌తో పాటు విజయ్‌సేతుపతి సరసన నటించే చిత్రం కూడా ఉందన్నారు. అయితే విజయ్‌సేతుపతితో నటించేది హిందీలోనా, తమిళంలోనా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే విజయ్‌సేతుపతి ఇప్పుడు హిందీలోనూ బాగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు