కొత్త స్టెప్‌!

25 Jun, 2017 01:16 IST|Sakshi
కొత్త స్టెప్‌!

సినిమాల్లోకి ప్రభుదేవా ఫస్ట్‌ స్టెప్‌ కొరియోగ్రఫీ – సక్సెస్‌. సెకండ్‌ స్టెప్‌ హీరో – సక్సెస్‌. థర్డ్‌ స్టెప్‌ డైరెక్షన్‌ – సక్సెస్‌. రెండు తమిళ సినిమాలకు పాటలు పాడారు. ఓ సినిమాకి పాట రాశారు. ఇప్పుడు ప్రభుదేవా ఇంకో స్టెప్‌ వేయనున్నారు. ఇప్పటివరకూ వేసిన అడుగులకన్నా అది ఫుల్‌ డిఫరెంట్‌.

ప్రభుదేవా విలన్‌గా స్టెప్‌ వేయనున్న ఆ సినిమా పేరు ‘మెర్‌క్యురీ’. స్టోన్‌ బెంచ్‌ ఫిలిమ్స్‌ అండ్‌ ఒరిజినల్స్‌ పతకాంపై ‘పిజ్జా’ ఫేమ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది థ్రిల్లర్‌ మూవీ. ‘నిశ్శబ్దం ఎంతో శక్తిమంతమైనది’ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రభుదేవా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. టీనేజ్‌లో కెరీర్‌ ఆరంభించి, వేసిన ప్రతి అడుగులోనూ సక్సెస్‌ అయిన ప్రభుదేవా ఇప్పుడు వేయనున్న ఈ కొత్త స్టెప్‌లోనూ సక్సెస్‌ అవుతారని ఊహించవచ్చు.