నాపై నాకు నమ్మకం వచ్చింది

12 Oct, 2023 00:52 IST|Sakshi

– రాఘవా లారెన్స్‌

‘‘జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌’లో నాకు మేకప్‌ వాడలేదు. మేకప్‌ లేకుంటే బాగుండనేమో? అనుకున్నాను. కానీ, స్క్రీన్‌పై చూసుకున్నాక నా మీద నాకు నమ్మకం ఏర్పడింది’’ అన్నారు రాఘవా లారెన్స్‌. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రాఘవా లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌’. కార్తికేయన్‌ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది.  హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమాలోని ‘కోరమీసం..’ పాటను రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా లారెన్స్‌  మాట్లాడుతూ– ‘‘జిగర్తాండ’లో నేను చేయాల్సింది.. కానీ, కుదర్లేదు. ఆ చిత్రానికి కార్తీక్‌ సుబ్బరాజ్‌కు జాతీయ అవార్డు వచ్చింది. ‘జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌’ కోసం ఓ ఊర్లో రోడ్డు, బ్రిడ్జి నిర్మించారు మా నిర్మాత. ఆయన మంచి మనసు కోసమైనా ఈ చిత్రం బాగా ఆడాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పండగలా ఉంటుంది’’ అన్నారు కార్తికేయన్‌. ‘‘జిగర్తాండ’ కంటే డబుల్‌ ఎక్స్‌ రేంజ్‌లో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు కార్తీక్‌ సుబ్బరాజ్‌. ‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం’’ అన్నారు ఎస్‌జే సూర్య.

మరిన్ని వార్తలు