కాటమరాయుడు కుమ్మేస్తున్నాడు

5 Feb, 2017 10:36 IST|Sakshi
కాటమరాయుడు కుమ్మేస్తున్నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయిన కొద్ది సమయంలోనే రికార్డ్ వ్యూస్ సాధించాడు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు అఫీషియల్ రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో కనిపిస్తున్నాడు.

శనివారం రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ వ్యూస్లో రికార్డ్లు సృష్టిస్తోంది. విడుదలైన రెండు గంటల్లోనే మిలియన్ వ్యూస్ మార్క్ను అందుకున్న కాటమరాయుడు, ఆ తరువాత మరికొన్ని గంటల్లోనే రెండు మిలయన్ల మార్క్ను దాటేసింది. తొలి 24 గంటల్లో ఆల్ టైం రికార్డ్ కాయం అన్న నమ్మకంతో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం కిశోర్ కుమార్ పార్థసాని దర్శకుడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.