బ్రేకప్‌!

25 Sep, 2019 02:34 IST|Sakshi

హెడ్డింగ్‌ చదివి, పక్కన ఉన్న ఫొటో చూసి కియారా అద్వానీ ఎప్పుడు లవ్‌లో పడింది? ఎవరితో బ్రేకప్‌ అయ్యింది? అనే సందేహాలు వస్తే వెంటనే ఫుల్‌స్టాప్‌ పెట్టండి. ఎందుకంటే కియారా బ్రేకప్‌ రీల్‌ లైఫ్‌కు సంబంధించినది. బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న కియారా అద్వానీ ఇటీవల ‘ఇందూ కీ జవానీ’ అనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అబిర్‌ సేన్‌ గుప్తా దర్శకుడు. ఆదిత్య సీల్‌ ప్రధాన పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమాలోని ఇందు పాత్ర కోసం ప్రిపేర్‌ అవుతున్నారు కియారా. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఇందు అనే యువతి ఓ ఆన్‌లైన్‌ డేటింగ్‌ వెబ్‌సైట్‌ ద్వారా లవ్‌లో పడుతుంది. ప్రేమించిన వ్యక్తితో కలయిక తర్వాత ఇందూకి బ్రేకప్‌ అవుతుందట? అప్పుడు ఇందు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాటి నుంచి ఇందు ఎలా బయటపడింది? అనే అంశాల ఆధారంగా ‘ఇందూ కీ జవానీ’  కథనం ఉంటుందట. ఈ చిత్రం షూటింగ్‌ నవంబరులో మొదలవుతుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు