‘మరోసారి తల్లినవుతా’, డాక్టర్ల వార్నింగ్‌

27 Mar, 2017 11:20 IST|Sakshi
‘మరోసారి తల్లినవుతా’, డాక్టర్ల వార్నింగ్‌

లాస్‌ ఎంజెల్స్‌: ప్రముఖ హాలీవుడ్‌ నటి కిమ్‌ కార్దాషియాన్‌కు మరోసారి తల్లవ్వాలని ఉందంట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన కొత్త ప్రొమో ‘కీపింగ్‌ అప్‌ విత్‌ కార్దాషియాన్స్‌’  సందర్భంగా చెప్పారు. అయితే, ఈ సమయంలో తల్లికావడం ఆమెకు శ్రేయస్కరం కాదని, ప్రమాదం పొంచి ఉందని, అందుకే ఆ ఆలోచన మానుకోవాలని వైద్యులు తీవ్రంగా హెచ్చరించారు.

ఆమె తల్లి క్రిస్ జెన్నర్‌ కూడా ఆమెను అలా ప్రమాదానికి వదిలేయలేనంటూ హెచ్చరించింది. 36 ఏళ్ల కిమ్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు. కాగా తనకు మూడో బిడ్డ కూడా కావాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. ‘నా పిల్లలకు సోదరసోదరీమణులుంటే నాకు చాలా ఇష్టం. కానీ, వైద్యులు మాత్రం తనకది సురక్షితం కాదని అంటున్నారు. కానీ, నేను మాత్రం మరో బేబి కోసం ప్రయత్నించాలని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.