స్వచ్ఛమైన ప్రేమికులను కృష్ణమ్మ కలిపింది..

1 Feb, 2015 00:33 IST|Sakshi
స్వచ్ఛమైన ప్రేమికులను కృష్ణమ్మ కలిపింది..

 నీ ప్రేమ స్వచ్ఛమైనదే అయితే... దానిని గెలిచేలా చేయడానికి ప్రకృతంతా ఏకమవుతుంది అనేది నానుడి. వాళ్లిద్దరి ప్రేమ స్వచ్ఛమైనదే. అందుకే సాక్షాత్తు కృష్ణా నదే పూనుకొని తన ప్రవాహాన్ని మార్చుకుంది. ప్రేమ ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేసింది. అది ప్రకృతి గెలుపు. ప్రేమ గెలుపు. రాధా కృష్ణులు ఎప్పటికీ కలవరంటారు. వాళ్లిద్దరి పేర్లు అవే. రాధ, కృష్ణ. ఇద్దరూ చిన్నప్పుడే ఒకరికొకరు స్నేహితులయ్యారు. క్లాస్‌లో తెలివిగల రాధ, చదువురాని కృష్ణకు స్ఫూర్తిగా మారింది. ఆమె నవ్వునే చూస్తూ ఆమె కళ్లను కళ్లల్లో పెట్టుకుంటూ అతడు కెరీర్‌లో ఒక్కొక్క మెట్టే ఎక్కాడు.
 
  కృష్ణమ్మ సాక్షిగా ఆమెను గెలుచుకుందాం అనుకున్నాడు. కాని అడ్డంకి. తను ప్రాణం కన్నా ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకుండా మూడు సందర్భాల్లో తప్పిపోతుంది. ఇక ఆఖరి సందర్భంలో ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలి. కాని అప్పుడు కూడా అతడు ఊహించింది ఒకటి. జరిగింది ఒకటి. కాని కృష్ణమ్మ ఆశీస్సులు ఉన్న ప్రేమ వారిది. ఆ నదే వారిని కలిపింది. ఎలా? తెలియాలంటే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చూడాల్సిందే. కన్నడంలో పెద్ద విజయం సాధించిన ‘చార్మినార్’ రీమేక్‌కు మరిన్ని హంగులు, నేటివిటీ, కథాబలం జత చేసి దర్శకుడు ఆర్.చంద్రు తీసిన ఈ సినిమా ప్రతి మనసునూ తాకే సన్నివేశాలతో విడుదలకు సిద్ధమవుతుంది.
 
  నిర్మాత లగడపాటి శ్రీధర్ తన సంస్థ రామలక్ష్మి క్రియేషన్స్ దశాబ్ద వేడుకల సందర్భంగా ప్రేక్షకులకు అందిస్తున్న క్యూట్ లవ్‌స్టోరీ ఇది. సుధీర్, నందిత ఇది వరకే హిట్ పెయిర్‌గా నిరూపించుకున్నారు. ఈ సినిమాలో వారిరువురి మధ్య కెమిస్ట్రీ మరింత పే చేయొచ్చు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి