3 నెలల్లోనే 15 కిలోలు తగ్గారు!

6 Jun, 2020 06:46 IST|Sakshi

సినిమా: ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక కొత్త ఫొటోలు ఉన్నాయి. వాటిని చూసిన నెటిజన్లు ఎవరి బ్యూటీ అని ఆశ్చర్యపోతున్నారు. ఆ బ్యూటీ ఒక నాటి ప్రముఖ కథానాయిక కుష్బూ అని తెలియడంతో మరింత షాక్కుకు గురవుతున్నారు. అవును ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న నటి కుష్బూ ఫొటోలను చూస్తే ఎవరైనా చదవాల్సింది. అంత స్లిమ్ముగా ఆమె తయారయ్యారు. నిజానికి నటి కుష్బూ ఆరంభంలో సన్నగా నాజూగ్గా ఉండేవారు. అలా తెలుగు తమిళ భాషల్లో కథానాయికగా నటించి ప్రముఖ నటిగా రాణించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కాస్త లావయ్యారు దీంతో ఆమె పేరుతో కుష్బూ ఇడ్లీ కూడా మార్కెట్లోకి వచ్చి పాపులర్‌ అయింది. అలాంటి కుష్బూ అనంతరం రాజకీయాల్లో కి ప్రవేశించి అక్కడ కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు, టీవీ సీరియల్లో అంటూ బిజీగా ఉన్న కుష్బూ తాజాగా రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న అన్నాత్త చిత్రంలో ఆయనకు జంటగా నటిస్తున్నారు. లాక్డౌన్‌ అమల్లోకి రావడంతో సినీ పరిశ్రమ స్తంభించిపోయింది.

ఈ కాలాన్ని నటి కుష్బూ చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఆమె తన భారీ కాయాన్ని కసరత్తులతో 15 కిలోలు బరువు తగ్గి చాలా స్లిమ్గా తయారయ్యారు. ఆ ఫొటోలు అనే సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు అవి ఎప్పుడు నెటిజన్లను అప్పుడప్పుడు ఉన్నాయి. నటి కుష్బూ మళ్లీ కథానాయికగా నటిస్తుందా అనే ఆసక్తి ఆమె అభిమానుల్లో వ్యక్తమవుతోంది. కాగా తాజాగా రజనీకాంత్‌కు జంటగా నటిస్తున్న అన్నాత్త చిత్రం కోసమే పుష్ప బరువు తగ్గి చాలా స్లిమ్గా తయారైందని సమాచారం. మన విషయం ఏంటంటే నటి కుష్బూ కూతురు కూడా వర్క్‌ ఔట్‌ చేసి స్లిమ్‌గా తయారయ్యారు. దీంతో కుష్బూ తన కూతురుకు పోటీగా తయారైందా అనే అభిప్రాయం ఆమె అభిమానులు భయపడుతున్నారు. కాగా సుమారు మూడు నెలల్లోనే 15 కిలోల బరువు తగ్గిన కుష్బూను చూసి అందరూ అభినందిస్తున్నారు. నిజంగానే ఆమె మళ్లీ కథానాయికగా నటించాలని ఆకాంక్షిస్తున్నారా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా