గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్‌ హీరోయిన్‌.. 13 ఏళ్లుగా వెండితెరకు దూరం..

14 Nov, 2023 16:35 IST|Sakshi

బొద్దుగా, ముద్దుగా ఉన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఒకే ఏడాది రెండు భాషల్లో సినిమాలు చేసి సాండల్‌వుడ్‌, టాలీవుడ్‌లో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మలయాళ, బాలీవుడ్‌ సినిమాలు చేసింది. విదేశీ చిత్రంలోనూ నటించింది. ఇన్ని భాషల్లో నటించిందంటే సినిమాల జాబితా పెద్దదే అనుకునేరు.. కానే కాదు.. తన కెరీర్‌ మొత్తంలో ఏడు చిత్రాలు మాత్రమే చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్‌ మరెవరో కాదు.. శ్వేత అగర్వాల్‌.

ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడిన హీరోయిన్‌
2002లో అల్లరి చిత్రంతో తెలుగులో, కిచ్చ మూవీతో కన్నడలో ప్రేక్షకులకు పరిచయమైంది శ్వేత. తర్వాతి ఏడాది రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్‌తో జత కట్టింది. గమ్యం మూవీలో హత్తిరి చింతామణి అనే ఐటం సాంగ్‌లోనూ యాక్ట్‌ చేసింది. అనంతరం షాపిత్‌ అనే హారర్‌ మూవీలో నటించి వెండితెరకు గుడ్‌బై చెప్పేసింది. అవకాశాలు రాకపోవడం వల్లే తను ఇండస్ట్రీకి దూరమైనట్లు తెలుస్తోంది.

నటుడితో పెళ్లి
అయితే షాపిత్‌ అనే సినిమాలో శ్వేతతో పాటు ప్రముఖ గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్‌ యాక్ట్‌ చేశాడు. అప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించడం, ఇరు కుటుంబాలు ఓకే చెప్పడంతో 2020వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లకే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది శ్వేత. తల్లయ్యాక కొంత లావైన శ్వేత కూతురితో ఆడుకుంటున్న ఫోటోలను అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది. ఆమె లేటెస్ట్‌ లుక్‌ చూసిన జనాలు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: మందుకు బానిసై చావు చివరి అంచులదాకా వెళ్లా.. ధనుష్‌ కూడా మద్యం..

మరిన్ని వార్తలు