లింగుస్వామి దర్శకత్వంలో ‘సెవెన్‌’హీరో

1 Jul, 2019 20:46 IST|Sakshi

యువ క‌థానాయ‌కుడు హ‌వీశ్ త‌మిళ స్టార్ట్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా చేయ‌బోతున్నారు. ఆగ‌స్టు నుంచి ఈ సినిమా షూటింగ్‌ రెండు భాష‌ల్లో స‌మాంత‌రంగా రూపొంద‌నుంది. ర‌న్‌, పందెంకోడి వంటి చిత్రాల‌తో క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న లింగుస్వామి, స్టాఫ్ ఇమేజ్ ఉన్న హ‌వీశ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌డం అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతుంది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర బృందం తెలియ‌జేసింది.

నువ్విలా, రామ్ లీలా, జీనియస్ చిత్రాలతో అలరించిన హవీశ్‌ తాజాగా ‘సెవెన్‌’చిత్రంతో అలరించాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఇక తమిళ క్రేజీ డైరెక్టర్‌ లింగుస్వామి తెలుగులో రూపొందిన `తఢాఖా` సినిమాను తమిళంలో రూపొందించారు. అలాగే ఈయ‌న రూపొందించిన `సండైకోళి` తెలుగులో `పందెంకోడి`గా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. గ‌త ఏడాది `పందెంకోడి `2 కూడా విడుద‌లైంది. అయితే ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా హవీశ్‌తో సినిమాను పట్టాలెక్కించేందుకు లింగుస్వామి సిద్దమయ్యారు.    

మరిన్ని వార్తలు