కొత్తగా వచ్చారు!

17 Jan, 2020 00:30 IST|Sakshi
సారా అలీఖాన్, కార్తీక్‌ ఆర్యన్‌

కేవలం మన సినిమాల ప్రభావమే కాదు.. మన సంక్రాంతి పండగ ఎఫెక్ట్‌ బాలీవుడ్‌పై కూడా పడినట్లుంది. కొన్ని హిందీ సినిమాల ఫస్ట్‌లుక్, కొత్త పోస్టర్స్‌ మన సంక్రాంతి పండగ సమయంలోనే విడుదలై హిందీ సినిమా అభిమానుల్లో ఆనందాన్ని పెంచింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. బాలీవుడ్‌ యువ కథానాయిక ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఈ చిత్రం విడుదల కానుంది.

‘షేర్‌ షా’ చిత్రం కోసం సైనికుడిగా మారి సరిహద్దుల్లో శత్రువులపై వీరోచిత పోరాటం చేస్తున్నారు సిద్దార్థ్‌ మల్హోత్రా. విష్ణువర్థన్‌ దర్శకత్వం. కార్గిల్‌ యుద్ధంలో సత్తా చాటిన పరమవీర చక్ర కెప్టెన్‌ విక్రమ్‌ బత్రా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. గురువారం (జనవరి 16) సిద్దార్థ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ విడుదలయ్యాయి. ‘షేర్‌ షా’ చిత్రం ఈ ఏడాది జూలై 3న విడుదల కానుంది. దాదాపు 11 ఏళ్ల క్రితం ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇంతియాజ్‌ అలీ.

ఈ చిత్రంలో కార్తీక్‌ ఆర్యన్, సారా అలీఖాన్‌ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది.  వరుణ్‌ ధావన్‌ తర్వాతి చిత్రానికి ‘మిస్టర్‌ లేలే’ అనే టైటిల్‌ ఖరారైన సంగతి తెలిసిందే. శశాంక్‌ కేతన్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 1న విడుదల కానుంది. మరో సినిమా ఏడేళ్ల క్రితం వచ్చిన హిందీ చిత్రం ‘గో గోవా గాన్‌’కి  సీక్వెల్‌ తెరకెక్కనుంది. ఇది వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన దినేష్‌ విజన్‌ వెల్లడించారు. ఇంకా మరికొన్ని బయోపిక్‌లు, వెబ్‌ సిరీస్‌లకు సంబంధించిన ప్రకటనలు గత మూడు రోజుల్లో వెల్లడి కావడం విశేషం.

సిద్ధార్ధ్‌ మల్హోత్రా


అలియాభట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా