త్వరలో ఏపీ మా అవార్డులు

2 Jul, 2019 05:56 IST|Sakshi

‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌’ ఆధ్వర్యంలో త్వరలో అవార్డులు ఇవ్వనున్నట్లు ‘మా ఏపీ’ వ్యవస్థాపకుడు–దర్శకుడు దిలీప్‌రాజా, ‘మా ఏపీ’ ప్రెసిడెంట్‌ సినీ నటి కవిత తెలిపారు. తెనాలిలో ఇటీవల ‘మా ఏపీ’ సర్వసభ్య సమావేశం జరిగింది. తొలుత స్వర్గీయ విజయ నిర్మలకు నివాళులర్పించారు. అనంతరం దిలీప్‌రాజా, కవిత మాట్లాడుతూ– ‘‘2018కి సంబంధించి ఉత్తమ చిత్రాలకు అవార్డులు ఇవ్వనున్నాం. ఎలాంటి జ్యూరీని నియమించకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని అవార్డులకు ఎంపిక చేస్తాం.

స్వర్గీయ విజయనిర్మల స్మారక అవార్డును ప్రముఖ దర్శకులకుగానీ, ప్రముఖ మహిళా నటీమణికిగానీ ఇస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఆగస్టు 15, 2019 వరకు ఎంట్రీలను పంపొచ్చు. తమ పేరు, చిరునామా, ఆధార్‌ కార్డులతో ప్రజలు తమ తీర్పును సీల్డ్‌ కవర్‌లో ‘మా ఏపీ’ కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలి–522201, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు పంపాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటుడు, ‘మా ఏపీ’ ప్రధానకార్యదర్శి నర్సింహరాజు, జయశీల, నిర్వహణ కమిటీ చైర్మన్‌  బాసింశెట్టి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు