రెండేళ్లు... పద్నాలుగు గంటలు

18 Jan, 2019 05:37 IST|Sakshi
మాధవన్‌

కదలకుండా కుర్చీలో ఐదు గంటలకు మించి కూర్చోవాలంటే ఎవరైనా కాస్త ఇబ్బంది పడాల్సిందే. అలాంటిది ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ సినిమాలోని క్యారెక్టర్‌ కోసం హీరో మాధవన్‌ దాదాపు 14 గంటలు మేకప్‌తో అలాగే కుర్చీలో కూర్చుండిపోయారట. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మాధవన్‌ హీరోగా నటిస్తున్నారు. అంతేకాదు ఒక దర్శకుడు కూడా. అనంత మహాదేవన్‌ మరో దర్శకుడు.

‘‘నంబి నారాయణన్‌ పాత్ర కోసం రెండేళ్లు కష్టపడ్డాం. ఇప్పుడు ఈ సినిమాలోని నా పాత్ర లుక్‌ కోసం కుర్చీలో పద్నాలుగు గంటలు కూర్చుండిపోవాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు మాధవన్‌. ఈ సినిమా సమ్మర్‌లో విడుదల కానుంది. ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగులో డైరెక్ట్‌ చిత్రం చేసిన మాధవన్‌ నెక్ట్స్‌ ‘వస్తాడు నా రాజు’ ఫేమ్‌ హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో మరో తెలుగు సినిమాలో హీరోగా నటించనున్నారు. అనుష్క, అంజలి, షాలినీ పాండే ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. మార్చిలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.

మరిన్ని వార్తలు